SRI ANJANEYA DANDAKAM in Telugu:
ఓం శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం, ప్రభాదివ్యకాయం, ప్రకీర్తిప్రదాయం,ప్రశస్తప్రకాయం, భజే వాయుపుత్రం, భజే బాలగాత్రం, భజేహం పవిత్రం, భజే సూర్యమిత్రం, భజే రుద్రరూపం, భజే బ్రహ్మతేజం, పఠo చున్ ప్రభాతంబు సాయత్ర మున్, నీ నామ సంకీర్తనల్ జేసి, నీరూపు వర్ణించి, నీ మీదనే దండకం బొక్కటిన్, చేయ నూహించి, నీ పాదపద్మంబులన్ గొల్చి, నిందలంచీ, నీ మీద నీ దండకం బొక్కటిం చేయ నూహించి, నీ మూర్తి గావించి, నీ సుందరం బెంచి, నీ దాస దాసుండనై, రామభక్తుండనై, నిన్ను నే గొల్చెదన్, నిన్ను నే తెల్సితిన్, నీ కటాక్షంబునన్ చూసితిన్, వేడుకల్ జేసితే, నన్ను రక్షించితే, అంజనాదేవి గర్భాన్వయా దేవ, నిన్నెంచ నే నెంతవాడన్, దయాశాలివై చూసితే, దాతవై బ్రోచితే, దగ్గరన్ నిల్చితే, తొల్లి సుగ్రీవుకున్ మంత్రివై, స్వామికార్యంబు నందుండి, శ్రీ రామ సౌమిత్రులన్ చూసి, వారిన్ విచారించి, సర్వేశు పూజించి, యబ్బానుజుo బంటు గావించి, అవ్వాలినిం చంపి, కాకుత్సతిలకున్ దయా దృష్టి వీక్షించి, కిష్కింధ కేతెంచి, శ్రీ రామాకార్యార్థి యై లంక కేదెన్చియున్, లంకిణిన్ జంపియున్, లంకయున్ గాల్చియున్, భూమిజన్ జూఛి, ఆనంద ముప్పొంగి, ఆ ఉంగరం బిచ్చి, ఆ రత్నమున్ తెచ్చి, శ్రీ రామకున్నిచ్చి, సంతోషునిన్ జేసి, సుగ్రీవునిన్, అంగదున్, జాంబవంతాది నీలాదులన్ కూడి, ఆ సేతువున్ దాటి, వానరుల్మూకలై, పెన్మూకలై, దైత్యులన్ ద్రుంచగా, రావణుండంత, కాలాగ్ని యుగ్రుండై కోరి, బ్రహ్మాoడమైనట్టి, ఆ శక్తియన్వేసి, ఆ లక్ష్మణున్ మూర్చగావించగా, అప్పుడేబోయి, సంజీవియున్ దెచ్చి, సౌమిత్రికున్నిచ్చి, ప్రాణంబు రక్షింపగా, ఆ కుంభకర్ణాది వీరాళితో బోరి, చెండాడి, ఆ శ్రీ రామబాణాగ్ని, వారoదరునన్ రావణున్ జంపగా, అంత లోకంబు, ఆనందమైయుండి, అవ్వేళ ఆ విభీషణున్వేడుకన్, తోడుకొన్వచ్చి, పట్టాభిషేకంబు జేయించి, సీతమహాదేవినిన్ దెచ్చి, శ్రీ రామకున్నిచ్చి, అంతయోధ్యకున్ వచ్చి, పట్టాభిషేకంబు, సంభ్రమ్మమైయు న్న, నీకన్న, నాకెవ్వరున్, కూర్మిలేరుంచు, మన్నించినన్, రామభక్తి ప్రశస్తంబుగా, నిన్ను నీ నామసంకీర్తనల్ చేసితే, పాపముల్ బాయునే, భయములున్ తీరునే, భాగ్యముల్ గల్గునే, సకల సామ్రాజ్యముల్సకల సంపత్తులున్గల్గునే, వానరాకార, ఓ భక్తమందార, ఓ పుణ్యసంచార, ఓ వీర, ఓ ధీర, నీవే సమస్తంబు, నీవే మహాజయము, నీవే మహాఫలముగా వెలసి, ఆ తారక బ్రహ్మమంత్రంబు పఠియించుచున్, స్థిరముగా, వజ్రదేహంబునన్ దాల్చి, శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ ఎంచున్ మనః పూర్వమై ఎప్పుడున్, తప్పకన్ తలతు నా జిహ్వయందుoడి, దీర్ఘ దేహoబునన్, త్రైలోక్య సంచారివై, రామనామాoకిత ధ్యానివై, బ్రహ్మవై, బ్రహ్మతేజంబునన్, రౌద్ర కల్లోల నీ జ్వాల హా వీర, హనుమంత, ఓంకార, ఓంకార, హ్రీoకార శబ్దంబులన్, పిశాచంబులన్, భూత ప్రేత పిశాచ శాకినీ ఢాకినీ గాలిదయ్యంబులన్ జుట్టి, నేలంబడoగొట్టి, నీ ముష్టిఘాతంబులన్, బాహుదండంబులన్, రోమఖడ్గంబులన్, ద్రుంచి, కాలాగ్నిరుద్రుండవై, బ్రహ్మప్రభాభాసితంబైన, నీ దివ్యతేజంబునన్ చూపి, రా రా నా ముద్దు నరసింహా యంచున్ , దయాదృష్టి వీక్షించి, నన్నేలు నా స్వామీ, నమస్తే సదా బ్రహ్మచారి, నమస్తే వాయుపుత్రా, నమస్తే వ్రతాపూర్ణిహారీ, నమస్తే, నమస్తే, నమస్తే నమో నమః ||
శ్రీ ఆంజనేయ అష్టోత్తర శతనామావళి :
ఓం శ్రీ ఆంజనేయాయ నమః
ఓం మహావీరాయ నమః
ఓం హనుమతే నమః
ఓం మారుతాత్మజాయ'నమః
ఓం తత్వజ్ఞానప్రదాయ నమః
ఓం సీతాదేవీముద్రాప్రదాయకాయ నమః
ఓం అశోకవనికాచ్ఛీత్త్రే నమః
ఓం సర్వమాయావిభంజనాయ నమః
ఓం సర్వబంధవిమోక్త్రే నమః
ఓం రక్షోవిధ్వoసకారకాయ నమః
ఓం పరవిద్యాపరిహారాయ నమః
ఓం పరశౌర్యవినాశనాయ నమః
ఓం పరమంత్రనిరాత్రే నమః
ఓం పరయంత్ర ప్రభేదకాయ నమః
ఓం సర్వగ్రహవినాశినే నమః
ఓo భీమసేనసహాయకృతే నమః
ఓం సర్వదుఖహరాయ నమః
ఓం సర్వలోకచారిణే నమః
ఓం మనోజవాయ నమః
ఓం పారిజాతద్రుమమూలస్థాయ నమః
ఓం సర్వమంత్ర స్వరోపవతే నమః
ఓం సర్వతంత్ర స్వరూపిణే నమః
ఓం సర్వయంత్రాత్మకాయ నమః
ఓం కపీశ్వరాయ నమః
ఓం మహాకాయాయ నమః
ఓం సర్వరోగహరాయ నమః
ఓం ప్రభవే నమః
ఓం బలసిద్ధికరాయ నమః
ఓం విద్యా సంపత్ప్రదాయకాయ నమః
ఓం కపిసేనానాయకాయ నమః
ఓం భవిష్యచతురాననాయ నమః
ఓం కుమార బ్రాహ్మచారిణే నమః
ఓం రత్నకుoడలదీప్తిమతే నమః
ఓం చంచలద్వాలసన్నద్ధలంబ మానశిఖోజ్జ్వలాయ నమః
ఓం గoధర్వ విద్యాతత్వజ్ఞాయ నమః
ఓం మహా బలపరాక్రమాయ నమః
ఓం కారాగృహవిమోక్త్రే నమః
ఓం శృంఖలాబంధమోచకాయ నమః
ఓం సాగరోత్తారకాయ నమః
ఓం ప్రాజ్ఞాయ నమః
ఓం రామదూతాయ నమః
ఓం ప్రతాపవతే నమః
ఓం వానరాయ నమః
ఓం కేసరీపుత్రాయ నమః
ఓం సీతాశోక నివారణాయ నమః
ఓం అoజనాగర్భ సంభూతాయ నమః
ఓం బాలార్కసద్శశాననాయ నమః
ఓం విభీషణ ప్రియకరాయ నమః
ఓం దశగ్రీవకులాంతకాయ నమః
ఓం లక్ష్మణప్రాణదాత్రే నమః
ఓం వజ్రకాయాయ నమః
ఓం మహాద్యుతయే నమః
ఓం చిరంజీవినే నమః
ఓం రామభక్తాయ నమః
ఓం దైత్యకార్యవిఘాతకాయ నమః
ఓం అక్షహంత్రే నమః
ఓం కాంచనాభాయ నమః
ఓం పంచవక్త్రాయ నమః
ఓం మహాతపసె నమః
ఓం లంకినీభంజనాయ నమః
ఓం శ్రీ మతే నమః
ఓం సిoహికాప్రాణభంజకాయ నమః
ఓం గంధమాదనశైలస్థాయ నమః
ఓం లంకాపుర విదాహకాయ నమః
ఓం సుగ్రీవసచివాయ నమః
ఓం ధీరాయ నమః
ఓం శూరాయ నమః
ఓం దైత్యకులాంతకాయ నమః
ఓం సురార్చితాయ నమః
ఓం మహాతేజసే నమః
ఓం రామచూడామణిప్రదాయ నమః
ఓం కామరూపిణే నమః
ఓం పింగాళాక్షాయ నమః
ఓం వార్ధిమైనాక పూజితాయ నమః
ఓం కబళీకృతమార్తాండ మండలాయ నమః
ఓం విజితెన్ద్రియాయ నమః
ఓం రామసుగ్రీవసంధాత్రే నమః
ఓం మహిరావణ మర్దనాయ నమః
ఓం స్ఫటికాభాయ నమః
ఓం వాగధీశాయ నమః
ఓం నవవ్యాకృతిపండితాయ నమః
ఓం చతుర్బాహవే నమః
ఓం దీనబంధవే నమః
ఓం మహాత్మనే నమః
ఓం భక్తవత్సలాయ నమః
ఓం సంజీవనగాహర్త్రే నమః
ఓం శుచయే నమః
ఓం వాగ్మినే నమః
ఓం ధృఢవ్రతాయ నమః
ఓం కాలనేమి ప్రమథనాయ నమః
ఓం హరిమర్కటిమర్కటాయ నమః
ఓం దాoతాయ నమః
ఓం శాంతాయ నమః
ఓం ప్రసన్నాత్మనే నమః
ఓం శతకంఠమదాపహృతే నమః
ఓం యోగినే నమః
ఓం సీతాన్వేషణపండితాయ నమః
ఓం వజ్రదంష్ట్రాయ నమః
ఓం వజ్రనఖాయ నమః
ఓం రుద్రవీర్య సముద్భవాయ నమః
ఓం ఇన్ద్రజిత్ప్రహితామోఘ బ్రాహ్మాస్త్రవినివారకాయ నమః
ఓం పార్థధ్వజాగ్ర సంవాసినే నమః
ఓం శరపంజరభేదకాయ నమః
ఓం దశబాహవే నమః
ఓం లోకపూజ్యాయ నమః
ఓం జాoబవత్ప్రీతివర్ధనాయ నమః
ఓం సీతసమెత శ్రీరామపాదసేవా దురంధరాయ నమః
ఇతి శ్రీ ఆంజనేయఅష్ట్తోతరశాతనమవాళి సంపూర్ణం
||जय हनुमान ||
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.